సిరిసిల్లలో తేల్చుకుందాం.. ఓడిపోతే అందుకు నేను రెడీ.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి ఛాలెంజ్

byసూర్య | Fri, Mar 01, 2024, 08:07 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటుండటంతో.. రాజకీయం రంజుగా మారుతోంది. అయితే.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసరగా.. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. ఎమ్మెల్యే, సీఎం పదవులకు రాజీనామా చేసి రావాలంటూ కేటీఆర్ కూడా ప్రతిసవాల్ విసిరారు. దీంతో.. కాంగ్రెస్ నేతలు కేటీఆర్ టార్గెట్‌గా ఛాలెంజ్‌లు చేస్తూనే ఉన్నారు.


రేవంత్ రెడ్డి వరకు ఎందుకు తన మీద గెలిచి చూపించాలంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కేటీఆర్‌కు సవాల్ చేయగా... ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో ఛాలెంజ్ చేశారు. తాను నల్గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. కేటీఆర్ కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలన్నారు. సిరిసిల్లలో తాను పోటీ చేసి గెలుస్తానని.. కేటీఆర్ ఓడిపోతే కారు షెడ్డు మూసుకునేందుకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.


కేటీఆర్‌కు టెక్నికల్ నాలెడ్జ్ లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ఓ చిన్నపిల్లాడని.. తన స్థాయి కేటీఆర్‌ది కాదన్నారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని.. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయటూ తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ 200 కోట్లు ఖర్చు పెట్టి.. కేవలం 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని ఆరోపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అదే మెజార్టీ తనకొస్తే వెంటనే రాజీనామా చేసేవాడినంటూ ఎద్దేవా చేశారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM