కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు.. బేరం మామూలుగా లేదుగా

byసూర్య | Tue, Feb 20, 2024, 07:17 PM

సోషల్ మీడియా వాడే వారందరికీ కుమారి ఆంటీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆంటీ అంత ట్రెండింగ్‌లో ఉంది మరీ. హైదరాబాద్ కోహినూర్ ఐటీసీ వద్ద రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ నడిపే కుమారి అంటీ ఓవర్ నైట్‌లో సోషల్ మీడియాలో స్టార్ అయిపోయారు. ఒకే ఒక్క డైలాగ్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులతో ఆమె ఫుడ్ స్టాల్ క్లోజ్ కావటం.., రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు చర్చించుకోవటం.., సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆమె ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.


 ఈ ముచ్చటంతా పక్కన పెడితే.. 'మీ బిల్లు మెుత్తం రూ. 1000.. రెండు లివర్లు ఎక్స్‌ ట్రా' అనే డైలాగ్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ డైలాగే ఆమెను సెలబ్రెటీని చేసింది. ఆ డైలాగ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్, డీజే రీమిక్స్ సాంగ్స్ కూడా వచ్చాయి. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ డైలాగ్‌ను వాడుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. అతడు హెల్మెట్ ధరించకపోగా.. నిబంధనలుకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు చిక్కారు. అందుకు సంబంధించిన ఫోటోను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ ఫోటోకు 'మీది మెుత్తం రూ. 1000 అయ్యింది. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా' అనే కాప్షన్ జోడించారు. ఫైన్‌కు సంబంధించని వివరాలు చెబుతూ ట్రాఫిక్ పోలీసులు కమారి ఆంటీ స్టైల్‌లో పోస్టు పెట్టారు. దానికి పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు కుమారి ఆంటీని ఫాలో అవుతున్నారని పోస్టులు పెడుతుండగా.. మరికొందరు సైడ్ మిర్రర్, ఇండికేటర్లు కూడా లేవని వాటికి కూడా ఫైన్ వేయాలని రాసుకొచ్చారు. ఇంకొందరు హైదరాబాద్ పోలీసుల ట్రోలింగ్ లెవల్స్ ఫీక్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM