![]() |
![]() |
byసూర్య | Sun, Dec 03, 2023, 09:32 AM
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
నల్గొండ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉండగా, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ, కొడంగల్లో రేవంత్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కడా లీడ్ కనిపించలేదు.