తొలి రౌడ్ లో కాంగ్రెస్ ముందజ

byసూర్య | Sun, Dec 03, 2023, 09:15 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్‌ తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేసీఆర్‌ ముందంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య (బీఆర్‌ఎస్) ముందంజలో ఉన్నారు.
నల్గొండ పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉండగా, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ, కొడంగల్లో రేవంత్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కడా లీడ్ కనిపించలేదు.


Latest News
 

టీచర్ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం.. విధుల నుంచి యువతి తొలగింపు, ఆశలు ఆవిరి Mon, Nov 11, 2024, 07:40 PM
శరవేగంగా 4 లైన్ హైవే పనులు.. ఆ రూట్‌లో వాహనదారులకు నో టెన్షన్ Mon, Nov 11, 2024, 07:37 PM
జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి యత్నం.. అధికారుల కార్లు ధ్వంసం Mon, Nov 11, 2024, 07:23 PM
మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. సమయానికి దేవునిలా వచ్చి Mon, Nov 11, 2024, 07:20 PM
ఢిల్లీకి కేటీఆర్.. కేంద్ర పెద్దలతో భేటీ.. తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం Mon, Nov 11, 2024, 07:16 PM