వాహనాల కోసం ప్రత్యేక స్థలం కేటాయింపు

byసూర్య | Sun, Dec 03, 2023, 09:01 AM

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తున్నారు. 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. ఆ తర్వాత ఈవీఎంలను తెరచి లెక్కిస్తారు. ప్రతి 15 నుంచి 20 నిమిషాలకు ఒక రౌండ్ లెక్కిస్తారు. భద్రాచలం, చార్మినార్ నియోజకవర్గాల ఫలితం ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఫలితాలలో ఏ పార్టీ గెలుస్తుందో కింద కామెంట్ రూపంలో తెలపగలరు.
ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ దోమలగూడలోని ఏవి కళాశాలలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే అక్కడికి వచ్చే వారి వాహనాలను భారత్ స్కౌట్స్ & గైడ్స్ పాఠశాల వద్ద పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఉ. 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM