144 సెక్షన్ అమలు : జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి

byసూర్య | Sun, Dec 03, 2023, 08:34 AM

జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కేంద్రం చుట్టుపక్కల ఒక కిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి వెల్లడించారు. ఇద్దరు లేదా ముగ్గురు గుమిగూడి ఉండటానికి అనుమతుల్లేవన్నారు. కేంద్రంలోకి కేవలం ఓట్ల లెక్కింపు పాసులున్న వారిని మాత్రమే అనుమతిస్తారన్నారు. ఏజెంట్లు చరవాణులు, అగ్గిపెట్టె, సిరా బాటిళ్లు తీసుకురావొద్దన్నారు. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.


 


 


Latest News
 

అలా చేస్తే వదిలేదే లేదు... రీల్స్ స్టార్లకు సజ్జనార్ వార్నింగ్ Sat, Jan 17, 2026, 06:41 PM
ఆ భూములు కోల్పోయే యజమానులకు.. 400 శాతం పరిహారం Sat, Jan 17, 2026, 06:34 PM
మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా ప్రకటన Sat, Jan 17, 2026, 06:31 PM
చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’ Sat, Jan 17, 2026, 06:21 PM
కామారెడ్డి జిల్లా లింగంపేటలో మటన్ ధరలను పెంచారని.. స్థానికుల నిరసన Sat, Jan 17, 2026, 06:21 PM