ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని నేర్పాయి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్

byసూర్య | Sat, Dec 02, 2023, 09:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కాగా.. రాష్ట్రంలో సమీకరణాలు మారుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతుండటంతో.. ఆ పార్టీకి చెందిన నేతలు సంబురాలు చేసుకుంటుండగా.. బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని, రాజకీయాన్ని నేర్పాయని శంకర్‌నాయక్‌ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వాటిపై కాంగ్రెస్ నేతల సంబురాలపై శంకర్ నాయక్ స్పందించారు.


ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగాయని.. శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఎలా వివరించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఏ పాలకులు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. 14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పరుగులు పెట్టేలా చేశారని వివరించారు. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. ప్రజల నిర్ణయం ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైందని.. డిసెంబర్ మూడు రోజున అందరి భవితవ్యం తేలనుందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి ఎగురుతున్న కాంగ్రెస్, భాజపా వాళ్ల బతుకులు బయటపడతాయని వ్యాఖ్యానించారు.


మానుకోట ప్రజల నిర్ణయం ఏదైనా తాను శిరసావహిస్తానని శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్‌లో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు అన్ని అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని.. వివరించారు. వాటన్నింటినీ పూర్తి చేయాలన్న సదుద్దేశంతోనే ఈసారి ఎన్నికల్లో తాను నిలబడ్డానని చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత నీచమైన రాజకీయం చూడాల్సి వస్తుందని తన జీవితంలో ఎప్పుడూ ఊహిచంలేదన్నారు. ఏది ఏమైనా.. ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. తన చివరి రక్తపుబొట్టు వరకు ప్రజా సేవలో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చిన.. తానున్నానని ప్రజలు మర్చిపోవద్దని శంకర్ నాయక్ పేర్కొన్నారు.Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM