రాష్ట్రంలో పకడ్బందీగా కౌంటింగ్

byసూర్య | Sat, Dec 02, 2023, 11:58 AM

రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా పూర్తి కావడంతో కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రా లు సిద్ధ్దం చేసినట్లుగా శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో 1766 లెక్కిం పు టేబుళ్లు , 131 పోస్టల్ బ్యా లెట్ టేబుళ్లు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య Tue, Oct 22, 2024, 11:43 AM
ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి Tue, Oct 22, 2024, 11:38 AM
మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM