తెలంగాణ ఎన్నికల్లో 70.74శాతం పోలింగ్.. అత్యధికంగా యాదాద్రిలో పోలింగ్,,,చివరిస్థానంలో హైదరాబాద్

byసూర్య | Fri, Dec 01, 2023, 11:08 PM

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 వరకు పోలింగ్ స్టేషన్లలో క్యూలైన్లనలో నిల్చున్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 వరకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 70.74 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం ఓటింగ్ నమోదు కాగా.. హైద్రాబాద్‌లో అత్యల్పంగా 46.68 శాతం నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడు నియోజవర్గంలో అత్యధికంగా 91.51 శాతం నమోదైంది. అత్యల్పంగా యాకుత్‌పురాలో 39.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.


జిల్లాల వారీగా పోలింగ్ ఇలా...


యాదాద్రి – 90.03


మెదక్ – 86.69


జనగాం – 85.74


నల్గొండ – 85.49


సూర్యాపేట – 84.83


మహబూబాబాద్ – 83.70


ఖమ్మం – 83.28


ములుగు – 82.09


భూపాలపల్లి – 81.20


గద్వాల్ – 81.16


ఆసిఫాబాద్ – 80.82


సిద్దిపేట – 79.84


కామరెడ్డి – 79.59


నగర్ కర్నూల్ – 79.46


భద్రాద్రి – 78.65


నిర్మల్ – 78.24


వరంగల్ – 78.06


మహబూబ్‌నగర్ – 77.72


వనపర్తి – 77.64


నారాయణపేట – 76.74


పెద్దపల్లి – 76.57


వికారాబాద్ – 76.47


సంగారెడ్డి – 76.35


సిరిసిల్ల – 76.12


జగిత్యాల – 76.10


మంచిర్యాల – 75.59


కరీంనగర్ – 74.61


నిజామాబాద్ – 73.72


హనుమకొండ – 66.38


మేడ్చల్ – 56


రంగారెడ్డి – 59.94


హైదరాబాద్- 46.68


అసెంబ్లీ ఎన్నిల్లో పల్లె జనం పోటెత్తగా.. పట్టణ ప్రజలు బద్దకించారు. నియోజకవర్గాలవారీగా చూసుకుంటే అత్యధికంగా మునుగోడులో 91.5 శాతం ఓటింగ్ జరిగితే.. అత్యల్పంగా యాకత్‌పురాలో 39.6 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 2018లో 73.37 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 3 శాతం తక్కువగా నమోదైంది. ఓటు వేయటానికి ప్రభుత్వం సెలవు ఇచ్చినా.. పోలింగ్ కేందరంలో టైం వృథా కాకుండా పోల్ క్యూ రూట్ అనే సదుపాయం కల్పించినా.. పట్టణ ప్రజలు ఓటేయటానికి ముందుకు రాలేదు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వటం మధ్యలో శుక్రవారం కూడా సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశ్యంతో చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో పోలింగ్ శాతం తగ్గింది. ఓటింగ్‌కు దూరంగా ఉన్నవారంతా చదువుతున్న సోమరులని పలువురు విమర్శిస్తున్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM