తెలంగాణ ఎన్నికల పోలింగ్,,,,డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‍పై సీఐ లాఠీఛార్జ్

byసూర్య | Fri, Dec 01, 2023, 10:16 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమెుదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. కొన్ని చోట్ల తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని పోలింగ్‌ కేంద్రం ఓ సీఐ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝులిపించారు. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ నాదర్‌గుల్‌లోని జిల్లా పరిషత్తు పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్‌ కానిస్టేబుల్‌ యాదగిరి పోలింగ్ కేంద్రం బయట ఎదురుచూస్తున్నారు. పెట్రోలింగ్‌ వాహనంలో ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌ రెడ్డి అక్కడకు వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ను చూసిన కానిస్టేబుల్‌ సెల్యూట్‌ చేసేందుకు ప్రయత్నించారు.. అంతలోనే సీఐ 'ఇక్కడ నీకేం పని' అని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్‌ను లాఠీతో కొట్టారు. ఆయన్ను దూరంగా నెట్టేశారు. దాంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి పరుగులు తీశారు. హైదరాబాద్ పాతబస్తీలోనూ గురవారం పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చార్మినార్ కాంగ్రెస్ అభ్యర్థి మజీబుల్లా షరీఫ్ సోదురుడు సలీంపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఓ పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లిన ఆయనతో వాగ్వాదం పెట్టుకున్న ఎంఐఎం కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు.ఇలా అక్కడక్కడా చెదురుమెుదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM