సీఎం కేసీఆర్ అధ్యక్షతన ,,,,డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ

byసూర్య | Fri, Dec 01, 2023, 07:15 PM

తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. నాలుగో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్గం సమావేశం కానుంది. అయితే.. మంత్రివర్గ భేటీ ఎజెండా ఏంటీ అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాతి రోజు కేబినెట్ భేటీ అవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీకే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... రిజల్ట్స్ తర్వాతి రోజు కేబినేట్ భేటీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.


ఇదిలా ఉంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సీఎం కేసీఆర్ స్పందించినట్టు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. కాగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేయగా.. కేసీఆర్ మాత్రం.. "ఎందుకు ఆగమాగం, పరేషాన్ అయితుండ్రు.. మళ్లా మనమే వస్తున్నాం.. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం.. 2 రోజులు నిమ్మలంగా ఉండండి, మూడో తారీఖున అందరం కలిసి సంబరాలు చేసుకుందాం." అంటూ నేతలకు ధీమా ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చిన గెలుపు ధీమాతో.. నేతల్లో కొంత ధైర్యం వచ్చింది. సమావేశం అనంతరం.. ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ.. ఆనందంతో విక్టరీ సింబల్ చూపించారు.


Latest News
 

గుస్సాడీ కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటు: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 07:48 PM
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు Sat, Oct 26, 2024, 07:46 PM
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలు.. హైకోర్టులో పిటిషన్ Sat, Oct 26, 2024, 07:44 PM
బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపరాఫర్.. సాయంత్రం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం Sat, Oct 26, 2024, 07:43 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్.. వచ్చే వారంలోనే.. మంత్రి పొంగులేటి Sat, Oct 26, 2024, 07:41 PM