మోటర్లకు మీటర్లు పెట్టలేదు కాబట్టే తెలంగాణకు రుణాలు ఇవ్వలేదు: నిర్మలా సీతారామన్

byసూర్య | Tue, Nov 21, 2023, 11:17 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరపున ఢిల్లీ నేతలు రంగంలోకి దిగారు. కేంద్రం అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధికి సహకరించినా.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిధులకు మళ్లించిందంటూ కీలక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కేంద్ర మంత్రులు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌‌లో సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా.. మోటర్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం 25 వేల కోట్ల నిధులు ఆపేసిందంటూ ప్రతి సభలో సీఎం కేసీఆర్ పేర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా... ఈ విషయంపై నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకే.. తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని నిర్మలా సీతారమన్ స్పష్టం చేశారు. అదనపు రుణం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటించకుండా అదనంగా అప్పు ఇవ్వడం ఎలా వీలవుతుందన్నారు. మిగతా రాష్ట్రాలన్నీ అలా కాదని.. చెప్పిన వెంటనే మోటర్లు బిగించాయని.. అందుకే వాటికి అదనపు రుణాలు ఇచ్చామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.


మరోవైపు.. తెలంగాణ నినాదమైన నీళ్లు, నిధులు నియామకాలు ఇప్పటి వరకు అమలు కాలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. పెట్టుబడులకు అనుకూలంగా రాజధాని ఉన్న తెలంగాణ.. నేడు లోటు బడ్జెట్‌లో ఉందంటూ కీలక కామెంట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపించిందన్నారు. పిల్లర్లు కుంగిపోవడం మామూలు విషయం కాదన్నారు. ఇక.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని చెప్పుకొచ్చారు. అయితే.. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం సాధ్యం కాదంటూ కీలక కామెంట్ చేశారు నిర్మలా సీతారామన్.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM