'ఊసరవెల్లి' చీరను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

byసూర్య | Tue, Sep 26, 2023, 12:11 PM

చేనేత కళారత్న అవార్డు గ్రహీత, సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ తయారు చేసిన రంగులుమారే చీరను మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆవిష్కరించారు. కళాకారుడు విజయ్‌ నేత కళను మంత్రి కేటీఆర్ అభినందిచారు. ఇప్పటి వరకూ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర, సుగంధాలు వెదజల్లే చీర, దబ్బలంలో దూరే చీరలను తయారు చేసి ఓహో అనిపించారు ఆ తండ్రీ కొడుకులు. కానీ రంగులు మార్చే చీరను ఎప్పుడైనా చూశారా? తాజాగా రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ మరోసారి తన అద్భుత ప్రతిభను కనబరిచాడు. రంగులు మారే ఊసరవెల్లి చీరను రూపొందించి ఔరా అనిపించాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో చీర తయారు చేశాడు. ఆరున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్న ఈ చీర రంగులు మారుస్తూ చూపరులను ఆకట్టుకుంది.


Latest News
 

తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM