తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్

byసూర్య | Sun, Sep 24, 2023, 10:11 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. యూజీసీ ఏరియర్స్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు వైద్య సిబ్బందికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.



Latest News
 

అసెంబ్లీకీ 15 మంది డాక్టర్లునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ Mon, Dec 04, 2023, 09:26 AM
డీజీపీపై ఈసీ వేటు Mon, Dec 04, 2023, 09:25 AM
కాంగ్రెస్‌ విజయాన్ని స్వాగతిస్తున్నాం– అప్రజాస్వామిక, అవకాశవాద వైఖరిని తిరస్కరించిన ప్రజలు : సీపీఐ(ఎం) Mon, Dec 04, 2023, 09:23 AM
సీఎం కేసీఆర్‌ రాజీనామా– ఆమోదం తెలిపిన గవర్నర్‌ Mon, Dec 04, 2023, 09:22 AM
బీజేపీ ఎంపీలకు షాక్‌.. కాంగ్రెస్‌ ఎంపీలు విన్‌– దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మెదక్‌ ఎంపీ Mon, Dec 04, 2023, 09:20 AM