byసూర్య | Sun, Sep 24, 2023, 09:31 PM
చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. బాబుని అలా అరెస్టు చేయడం పెద్ద తప్పని జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. అంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టడం సరైనది కాదని సీతక్క పేర్కొన్నారు.
చంద్రబాబు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నారని, ఆయన 40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నారని పేర్కొన్న సీతక్క ఆయన ఈ స్కాం చేయలేదని తెలిపారు.రాష్ట్రానికి లక్షల కోట్లలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని పేర్కొన్న సీతక్క ,చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని రాజకీయ కోణాలే కనపడుతున్నాయని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఈ విషయం అందరికీ అర్థమవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబుకు మద్దతుగా నేడు ఐటి ఉద్యోగులు హైదరాబాద్ నుండి రాజమండ్రి కి చలో రాజమండ్రి కార్ల ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి వాహన తనిఖీలను చేపట్టారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఏపీ సిఐడి అధికారుల కస్టడీలో ఉన్న చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరు పరచనున్నారు. ఇక రిమాండ్ పొడిగింపు పై నేటి సాయంత్రం ఏసిబీ జడ్జి నిర్ణయం తీసుకోనున్నారు.దీంతో చంద్రబాబు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అందరిలో ఉత్కంఠగా మారింది.