byసూర్య | Sun, Sep 24, 2023, 01:49 PM
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులు బస్టాండ్ ఆవరణలో చీపుర్లతో క్లీనింగ్ చేశారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం మాట్లాడుతూ. ప్రయాణికులకు చెత్త విచ్చలవిడిగా వేయకుండా చెత్త బుట్టలో పడేయాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మహేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.