కుల, చేతి వృత్తుల వారికి అండగా కేసీఆర్ సర్కార్,,,మంత్రి సబితా ఇంద్రారెడ్డి

byసూర్య | Fri, Jun 09, 2023, 09:35 PM

మహేశ్వరం నియోజకవర్గంలో గొల్ల కురుమ సోదరులకు గొర్రెల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు.  కుల వృత్తులు,చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్బంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కులాలకు అండగా ఉంటూ పలు కార్యక్రమాలు చేపడుతూ తాజాగా కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించటo ఎంతో గొప్ప విషయం అని అన్నారు.గొల్ల కురుమ సోదరులకు మంత్రి శుక్రవారం నాడు గొర్రెలు పంపిణీకి సంభవించింది ఉత్తర్వులు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.... ఆధునికతతో జీవనాధారం భారంగా మారుతున్న వివిధ కులాల వారికి లక్ష రూపాయలు ఇవ్వాలనే గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారని అన్నారు.దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.విశ్వ బ్రాహ్మణ,నాయి బ్రాహ్మణ,రజక, కుమ్మరి,మేదరి,వంటి కుల వృత్తులు,చేతి వృత్తులకు కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారని,ఈ సందర్భంగా  ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికో ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటికే మృత్సకారులకి,ముదిరాజ్ కులస్తులకు చెరువులో చేపలు వదిలి జీవనోపాధి కల్పించటం,గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, రజక,బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేసారు.,లక్ష రూపాయల సహయంకు సంభందించి ఇటీవలి జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారని,పేద,మధ్యతరగతి ప్రజల సాధకబాధలు తెలిసిన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారని,అందరి ఆశీసులు వారికి అందించాలని మంత్రి కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి  పిలుపునిచ్చారు.తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది,దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలకు విశేష స్పందన వస్తుందని,ఊరూరా చెరువుల పండుగకు ఊహించని స్పందన వచ్చిందన్నారు.



Latest News
 

ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM
ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు Thu, May 02, 2024, 10:26 AM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 10:23 AM
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM