ఓ ప్రజాప్రతినిధితో డీఈ రమేష్ ఒప్పందం... టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త ట్విస్ట్

byసూర్య | Mon, Jun 05, 2023, 09:14 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కోర్టు అనుమతితో ఇటీవల విద్యుత్ శాఖ డీఈ రమేశ్ ను కస్టడీకి తీసుకున్న సిట్, అతనిని విచారించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో రమేశ్ ఒప్పందం చేసుకున్నట్లుగా ఈ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ కూతురు... రమేశ్ ద్వారా ఏఈఈ పరీక్షను రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని రమేశ్ రూ.75 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.


ఏఈఈ పరీక్ష జనవరి 22న జరిగింది. ఈ పరీక్షకు నెల రోజుల ముందే సదరు మాజీ ఎంపీటీసీని రమేశ్ కలిశాడు. పరీక్షకు ముందు ఆమెకు ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. తన కూతురుకు ఉద్యోగం వచ్చాకనే డబ్బులు చెల్లిస్తానని రమేశ్ తో చెప్పాడు. ఎలక్ట్రానిక్ డివైజ్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. డీఈ రమేశ్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్లుగా గుర్తించారు. ఒక్కొక్కరి నుండి కనీసం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.Latest News
 

తెలంగాణకు అతి భారీ వర్షాల సూచన Tue, Sep 26, 2023, 02:41 PM
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు Tue, Sep 26, 2023, 01:54 PM
మంగళవారం జిల్లాలో మంత్రి పువ్వాడ పర్యటన Tue, Sep 26, 2023, 01:50 PM
ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలి Tue, Sep 26, 2023, 01:48 PM
నాగర్ కర్నూల్ లో కారు దగ్ధం.. Tue, Sep 26, 2023, 01:32 PM