వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

byసూర్య | Thu, Jan 26, 2023, 10:01 AM

శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కించారు. అనంతరం మాట్లాడుతూ. తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని చెప్పారు. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారని తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారని వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉన్నదని చెప్పారు.

అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్‌, బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్‌ తమిళిసై సన్మానించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM