సచివాలయం నిర్మాణ పనులపై కేసీఆర్ నజర్...స్వయంగా పరిశీలించిన సీఎం

byసూర్య | Tue, Jan 24, 2023, 07:01 PM

ముహుర్తం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ నూతన సచివాలయంపై కేసీఆర్ నజర్ పెట్టారు. మంగళవారంనాడు ఆయన కొత్త సచివాలయం నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. చిన్నచిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లను ఏర్పాటు చేశారు. మరోవైపు సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు జాతీయ స్థాయిలో పలువురు నేతలను ఆహ్వానించబోతున్నట్టు సమాచారం.



Latest News
 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ముందు తెలిసేది చార్మినారే Sun, Dec 03, 2023, 09:11 AM
వాహనాల కోసం ప్రత్యేక స్థలం కేటాయింపు Sun, Dec 03, 2023, 09:01 AM
తెలంగాణలో మొదలైన కౌంటింగ్ Sun, Dec 03, 2023, 08:42 AM
144 సెక్షన్ అమలు : జిల్లా ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి Sun, Dec 03, 2023, 08:34 AM
ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. తెలంగాణ ఎన్నికలపై డీకే Sat, Dec 02, 2023, 09:59 PM