డిసెంబర్ 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

byసూర్య | Tue, Dec 06, 2022, 02:55 PM

సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి : జిల్లాలో ఈ నెల 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.డిసెంబర్ 7న మధ్యాహ్నం 2:00 గంటలకు సంగారెడ్డి,శాంతినగర్ లోని సెయింట్ ఆంథోని హైస్కూల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:00గంటలకు ముగింపు కార్యక్రమం,బహుమతి ప్రధానం ఉంటుందని పేర్కొన్నారు.ప్రారంభ,ముగింపు కార్యక్రమాల కు గౌ.ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల,విద్యాశాఖ మంత్రులు, జెడ్ పీ ఛైర్పర్సన్,మెదక్,జహీరాబాద్ లోక్ సభ సభ్యులు,జిల్లాలోని శాసన సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.3 రోజుల పాటు నిర్వహించు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రజలు,విద్యార్థులు అధిక మొత్తంలో  సందర్శించి విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

ఈ నెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం Thu, Feb 02, 2023, 10:00 PM
కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM