![]() |
![]() |
byసూర్య | Tue, Dec 06, 2022, 04:15 PM
బడుగు, బలహీన వర్గాల వారి కోసం అంబేద్కర్ చేసిన కృషి ప్రశంసనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని అన్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులు ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఎదగాలని దళితబంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టారన్నారు.