ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న విధానాన్ని పరిశీలించిన మంత్రి

byసూర్య | Thu, Dec 01, 2022, 11:05 AM

ఆయా శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. పోలీస్ శాఖలో 1. 35 లక్షల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ టలోని క్రీడా మైదానంలో పోలీసు ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ఆమె పలుకరించారు. శిక్షణ తీసుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను సాధించుకున్నామని వాటిని ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. కాళేశ్వరంతో నీళ్ల సమస్య లేకుండా చేశామని, తగినన్ని నిధులు సాధించామని, ఒక్కో శాఖలో భర్తీలతో నియామకాలకు ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రైవేట్ కోచింగ్లు, హాస్టళ్లకు రూ. లక్షలు పోసే నిరుద్యోగుల బాధలు చూసి ఆయా నియోజకవర్గాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అనంతరం శిక్షకులకు మంత్రి సబితారెడ్డి స్వయంగా గుడ్లు, పాలు అందజేశారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM