ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదు: బల్క సుమన్

byసూర్య | Wed, Nov 30, 2022, 10:44 PM

తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణకు వచ్చి ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. వైఎస్ కుటుంబం మెుత్తం తెలంగాణకు వ్యతిరేకమని అన్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు భవిష్యత్తులో ఏం జరిగినా తాము బాధ్యులం కామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


"పరాయి మనుషులు కిరాయి మనుషులతో వచ్చి తోలుబొమ్మలాడితే ఎవరూ పట్టించుకోరు. మీ డ్రామాలను ఎవరూ నమ్మరు. షర్మిల ఇలాగే మాట్లాడితే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదు. మా సహనానికి ఓపికకు హద్దు ఉంటది. రాబోయే రోజుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదు. సంస్కారహీనంగా అడ్డగోలుగు మాట్లాడితే అది పద్దతేనా ? తెలంగాణ గడ్డమీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెవులు మూసుకొను కూర్చోవాలా ? అసలెవరీ షర్మిల. ఆమెకు తెంలగాణ గురించి ఏం తెలుసు.


గతంలో హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చారు. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలని ఆనాడు వైఎస్ అన్నారు. ఈనాడు హైదరాబాద్‌ను షర్మిల అప్ఘనిస్థాన్‌తో పోల్చుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాలు కబ్జా పెట్టారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం. వైఎస్ జగన్ కూడా పార్లమెంట్‌లో తెలంగాణను వ్యతిరేకించారు. ఏపీ నుంచి వచ్చిన మహిళ, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న షర్మిల చెబితే ఎవరైనా నమ్ముతరా ?


తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని షర్మిల బయ్యారం గనులను దోచుకోవాలని ప్రయత్నించారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే తెలంగాణ ప్రజలకు కోపం. తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా ఉన్న షర్మిల తెలంగాణకు వచ్చి సుద్దులు చెబితే ఎవరైనా నమ్ముతారా ? నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గురించి అసభ్యకరంగా మాట్లాడారు. మా ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నా నియోజకవర్గంలో కూడా పాదయాత్ర సమయంలో ఇష్టారీతిలో మాట్లాడారు. ఆ సమయంలో మా పార్టీ శ్రేణులను నిలువరించా.


టీఆర్ఎస్‌ను చీల్చేందుకు వైఎస్ఆర్‌ ప్రయత్నాలు చేశారు. అందుకే మహబూబాబాద్‌లో గతంలో నీ సోదరుడు జగన్ యాత్ర చేస్తామంటే తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారు.షర్మిల మాట్లాడే మాటలు ఆడపిల్లలు మాట్లడే భాషేనా? తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్‌కు తెలియదా? . తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియదా ? సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా ?" అని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు.



Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM