తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే

byసూర్య | Tue, Oct 04, 2022, 05:29 PM

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్ తుల్జాభవాని దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని, సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.


Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM