![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 02:22 PM
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎతైన వీరనారి చిట్యాల ఐలమ్మ గారి కాంస్య విగ్రహావిష్కరణ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం చిట్కుల్ గ్రామంలో మన రజక సంఘం ఆధ్వర్యంలో విగ్రహ దాత TRS రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ విగ్రహదాతగా అందించడం చిట్కుల్ సర్పంచ్ గారు అందించడాన్ని మన రజక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకుని ఐలమ్మ గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల చాటినందుకు గాను యావత్ తెలంగాణ సమాజం తో పాటు సబ్బండ వర్గాల నుండి హర్షాతిరేకాలు వెలువడుతున్నాయని తెలంగాణ వీరవనిత మనవడు శ్రీ రామచంద్రం గారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఈరోజు చిట్కుల్ గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ నీలం మధు గారిని అభినందిస్తూ సన్మానించారు, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఐలమ్మ యొక్క స్ఫూర్తిని నింపుతూ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సర్పంచ్ నీలం మధు గారికి చిట్యాల ఐలమ్మ కాంస్య విగ్రహవిష్కరణకు మంత్రులు కేటీఆర్ మరియు హరీశ్ రావు గార్ల చేతుల మీదుగా జరగబోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు,ఈ సందర్భంగా రామచంద్రం గారు మాట్లాడుతూ జయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులందరూ తప్పకుండా హాజరవుతామని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు వారికి రాష్ట్ర రజకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాము.ఈ కార్యక్రమంలో మన రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి జీతయ్య, చిట్కుల్ వెంకటేశ్ , సత్తయ్య, ఆంజనేయులు సురేష్ లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.