కేసినోను లీగల్ గానే చేశాను: చికోటి ప్రవీణ్

byసూర్య | Wed, Aug 17, 2022, 06:19 PM

తాను ఎలాంటి తప్పు చేయలేదని... కేసినోను లీగల్ గానే చేశానని చికోటి ప్రవీణ్ చెప్పారు. చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈరోజు ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... కేసినోను లీగల్ గానే చేశానని చెప్పారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని తెలిపారు. రాజకీయ నేతల పేర్లు చెప్పాలని విచారణలో బెదిరిస్తున్నారని అన్నారు. తన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని తెలిపారు. 


మీడియాలో వస్తున్నట్టుగా తాను ఎలాంటి హవాలా వ్యాపారాలు నిర్వహించలేదని చికోటి ప్రవీణ్ చెప్పారు. తనకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయని తెలిపారు. అయితే, రాజకీయాలతో మాత్రం సంబంధం లేదని అన్నారు. తన కేసినోలకు వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన మాట నిజమేనని చెప్పారు. సినీ ప్రముఖుల చేత ప్రమోషన్లు చేయించానని... వారికి నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశానని తెలిపారు.


Latest News
 

మార్కెట్లో నకిలీ కరాచీ మెహందీలు.. రూ. 8 లక్షల విలువైన కోన్లు స్వాధీనం Thu, Jan 15, 2026, 08:15 PM
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్తగా 60 కోచ్‌లు Thu, Jan 15, 2026, 08:11 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ Thu, Jan 15, 2026, 07:37 PM
తెలంగాణలో కూడా జోరుగా కోడి పందేలు..! రూ.కోట్లల్లో బెట్టింగ్‌లు Thu, Jan 15, 2026, 07:33 PM
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల సంఖ్య పెంపు Thu, Jan 15, 2026, 07:30 PM