నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా అక్కడ నో ఎంట్రీ

byసూర్య | Sun, Aug 14, 2022, 01:07 AM

ట్యాంక్‌బండ్‌ స‌న్‌డే ఫ‌న్‌డే కార్యక్రమంలో బాగంగా ట్యాంక్‌బండ్‌పై నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా వాహనాలకు నో ఎంట్రీ విధించారు. క‌రోనా విజృంభ‌ణ‌కు ముందు హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సంద‌డిగా సాగిన సండే ఫ‌న్‌డే వేడుక‌లు మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మొద‌లవుతున్నాయి. ఈ సెల‌బ్రేష‌న్స్ రేప‌టి నుంచే మొద‌లు కానున్నాయి. సెల‌వు దినం ఆదివారం నాడు క్ర‌మం త‌ప్ప‌కుండా ట్యాంక్‌బండ్‌పై గతంలో స‌న్‌డే ఫ‌న్‌డే పేరిట వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఈ వేడుక‌లు ర‌ద్దు కాగా ఆదివారం నుంచి మ‌ళ్లీ మొద‌లుకానున్నాయి. 


నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా ట్యాంక్‌బండ్‌పై స‌న్‌డే ఫ‌న్‌డే వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌ల నేప‌థ్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల దాకా వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు శ‌నివారం ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల‌నుకునే వారు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM