కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Tue, Jul 05, 2022, 12:07 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మిగిలి ఉన్న అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నదీమ్ రాయ్, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, రాజేష్ పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM