ఎంత కోరిన తెలంగాణను కేంద్రం పట్టించుకోవడంలేదు: కేటీఆర్

byసూర్య | Thu, Jun 23, 2022, 02:59 AM

ఎంత కోరిన తెలంగాణను కేంద్రం పట్టించుకోవడంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌కు ఏ అర్హతలు లేకున్నా.. అధికారం చేతిలో ఉందనే డిఫెన్స్ కారిడార్‌ను కేంద్రం కేటాయించిందని మండిపడ్డారు. మౌలిక వసతులు లేకుండా డిఫెన్స్ కారిడార్ ఇవ్వగానే పెట్టుబడులు తరలిరావని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రం అయిన తెలంగాణ‌ను కేంద్రమే ప్రోత్సహించాలని చెప్పారు. సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలు స్థానిక జహీరాబాద్ వారికి పరిశ్రమ యజమాన్యం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు. రక్షణ రంగం పరిశ్రమల హబ్ హైదరాబాద్ అని చెప్పుకొచ్చిన ఆయన.. డిఫెన్స్ కారిడార్‌ను హైదరాబాద్-బెంగళూర్ మధ్య ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.


12,600 ఎకరాలు భూమి నిమ్జ్‌కు కేటాయిస్తే ఇప్పటికి 3,500 ఎకరాలే సేకరించినట్లు చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలకు ఉపాధి కల్పించాలని, భూమి కోల్పోతున్న రైతులకు మంచి పరిహారం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, వెమ్ టెక్నాలజీ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు. అంతకుముందు కేటీఆర్‌ను రైతులు అడ్డుకుంటారనే సమాచారంతో ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు గ్రామాల నుంచి బయటకి రాకుండా పోలీసుల ఆంక్షలు విధించారు. నిమ్జ్ భూసేకరణకు వ్యతిరేకంగా పలు గ్రామాల్లో రైతుల ఆందోళనలు చోటు చేసుకున్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM