ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ: తలసాని శ్రీనివాస్ యాదవ్

byసూర్య | Thu, Jun 23, 2022, 02:58 AM

దేశంలో స్థానిక ప్రభుత్వాలు ఉండటం బీజేపీకి ఇష్టం లేదని.. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని తెలంగాణ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆయనఅన్నారు.  రాష్ట్రపతి ఎన్నికల వేళ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని ఆరోపించారు. ‘ఆరోగ్యం బాగా లేదని మహారాష్ట్ర గవర్నర్ ఆస్పత్రిలో చేరడం, ఆ వెంటనే గోవా గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం లాంటివి చూస్తుంటే కుట్ర ఏంటో అర్థమవుతోంది’ అని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్‌లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బుధవారం (జూన్ 22) సాయంత్రం మీడియాతో మంత్రి తలసాని మాట్లాడారు.


ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అడ్డదారుల్లో అధికారం దక్కించుకుంటోదని మంత్రి తలసాని ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉంటే చీలికలు తీసుకొచ్చి చిన్నాభిన్నం చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గోవా లాంటి రాష్ట్రాల్లో ఇలాగే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారని మంత్రి తలసాని గుర్తు చేశారు. నిత్యం సంప్రదాయాలు, సంస్కృతిపై మాట్లాడే మోదీ ప్రభుత్వం.. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తోందని, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు.


మహమ్మద్‌ ప్రవక్తపై ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రపంచం ముందు భారత్ తలదించుకునే పరిస్థితులు తీసుకొచ్చారని, దేశం పరువు పోతోందని తలసాని అన్నారు. ‘రోజులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. మరో ప్రభుత్వం వచ్చినప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని మంత్రి తలసాని హెచ్చరికలు చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM