మీరొక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా

byసూర్య | Thu, Jun 23, 2022, 12:07 AM

మీరొక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారూ...ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్  మహీంద్రా పేర్కొన్నారు. ఇవాళ జహీరాబాద్ లో మహీంద్రా సంస్థ 3,00,001వ ట్రాక్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ పై కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆనంద్ మహీంద్రా గారూ చూడండి... మీ ట్రాక్టర్లకు ఎలా ప్రచారం కల్పిస్తున్నానో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. 


"మీరొక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్... అందులో ఎలాంటి సందేహంలేదు. అయితే ఆకాశాన్నంటుతున్న టాలీవుడ్ సామ్రాజ్యం మిమ్మల్ని ఎత్తుకుపోతుందేమోనన్నదే నా భయం" అంటూ ట్వీట్ చేశారు. అందుకు కేటీఆర్ వెంటనే బదులిచ్చారు. "సర్... మిమ్మల్ని లాగేవాళ్లెవరూ ఇంకా దొరకలేదా..!"  అంటూ చమత్కరించారు.


Latest News
 

ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM
ఖైరతాబాద్‌లో బస్సు బీభత్సం Tue, Jul 05, 2022, 11:50 AM
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు Tue, Jul 05, 2022, 11:47 AM
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం Tue, Jul 05, 2022, 11:45 AM
రైళ్ల పునరుద్ధరణకు గ్రీన్‌ సిగ్నల్‌... Tue, Jul 05, 2022, 11:42 AM