మహేంద్రా జీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: కేటీఆర్

byసూర్య | Thu, Jun 23, 2022, 12:06 AM

మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి అని ప్రముఖ‌ పారిశ్రామిక వేత ఆనంద్ మహీంద్రాను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్ ను తెలంగాణలోని ప్లాంట్ లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ప్లాంట్ లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం దాన్ని నడిపారు. 


ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "హేయ్... ఆనంద్ మహీంద్రా జీ... నన్ను చూడండి... మీ ఉత్పత్తులకు ఎంత చక్కగా ప్రచారం కల్పిస్తున్నానో! అందుకని మీరు మా రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించాల్సి ఉంటుంది" అంటూ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి చమత్కరించారు.


Latest News
 

మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM