బాలికపై సామూహిక అత్యాచారం!

byసూర్య | Tue, Jun 21, 2022, 10:49 AM

బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. చాంద్రాయణగుట్ట గుర్షన్-ఎ-ఎక్బాల్ కాలనీకి చెందిన బాలిక(14) ఈ నెల 18న అమ్మతో గొడవపడి అమ్మమ్మ ఇంటికి వెళుతూ దారి తప్పిపోయింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకోకపోవడం, బాలిక ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసారు. అయితే ఈ నెల 19 న బాలిక ఇంటికి రాగా.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘాజిమిల్లత్ కాలని, హఫీజ్ బాబానగర్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బాలికను ఈ నెల 18న బైకు పై ఎటో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఒక రోజంతా బంధించినట్లు సమాచారం. బాలిక చెప్పిన వివరాల ప్రకారం నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM