మూడు నెలల్లో డిగ్రీ కళాశాల: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jun 21, 2022, 10:44 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రచార కరపత్రాలు, బ్యానర్లను ఆయన విడుదల చేసి మాట్లాడారు. వినోభానగర్ లో అసంపూర్తి నిర్మాణంతో ఉన్న కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కాగా షిఫ్ట్ పద్ధతిలో జూనియర్, డిగ్రీ కళాశా కలలు నడుస్తున్నాయని దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రిన్సిపల్ ప్రభు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి. అసంపూర్తిగా భవనాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే 3 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్యాపకులు నాగోజీ, ఎస్కీ మూర్తి, నర్సయ్య, శ్రీను, సత్తం, మల్లిఖార్జున్, పద్మజ, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మీ, సుధ, రజిత, సునీత, అనిత, రాణి, నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM