మాజీ ఎమ్మెల్యే పై మర్డర్ కేసు కొట్టివేత.!

byసూర్య | Fri, May 13, 2022, 04:57 PM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌పై హత్య కేసును శుక్రవారం కోర్టు కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ 2013 జూలై 18న హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఎర్రశేఖర్ ఏ1గా ఉన్నారు. ఈ కేసులో ఎర్ర శేఖర్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ అలియాస్‌ ఎర్ర శేఖర్‌, అతని సోదరుడు జగన్‌మోహన్‌ దంపతులు చింతకుంట సర్పంచ్‌ పదవికి పోటీకి దిగారు.


ఈ విషయంలో ఇద్దరూ రాజీ కుదరలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఎర్ర శేఖర్ భార్య భవానీ జగన్మోహన్ భార్య అశ్విత కూడా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయమై అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి. మాటా మాటా పెరిగి ఎర్ర శేఖర్ జగన్మోహన్‌పై తన సోదరుడిని కారులో ఎక్కించుకుని విషయం మాట్లాడుతుండగా తుపాకీతో కాల్పులు జరిపాడని అప్పటి ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఎర్ర శేఖర్ 2013 ఆగస్టు 27న ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎర్ర శేఖర్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఎర్ర శేఖర్ బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. జిల్లా నేతలతో సఖ్యత లేకపోవడంతో ఎర్ర శేఖర్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM