పతంగ్ సంబరాల్లో మంత్రి తలసాని
 

by Suryaa Desk |

పంతంగ్ సంబరాలు అంటే చిన్ని, పెద్ద  తేడా అన్నది మర్చిపోతారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయానికి వస్తే...ఆయన మాస్ లీడర్ అన్నది మరవకూడదు.  ఆయన పతంగ్ పడితే ఇక.. హైదరాబాద్ లోని పీవీ మార్గ్ లో నెక్లెస్ రోడ్ వద్ద కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు. విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల ప్రజలు మన సంప్రదాయాలు మర్చిపోతున్నారని, మన ఆచారాలు, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పండుగల విశిష్టతను పిల్లలకు తల్లిదండ్రులే విడమర్చి చెప్పాలని అన్నారు.


Latest News
పోలీస్ శాఖలో కరోనా కలకలం...! Tue, Jan 18, 2022, 01:02 PM
కేంద్రానికి మంత్రి హరీష్ రావు లేఖ Tue, Jan 18, 2022, 12:40 PM
ఆ విద్యార్థులకు శుభవార్త Tue, Jan 18, 2022, 12:01 PM
మైనర్లు పట్టుబడితే పై తల్లిదండ్రులకు జైలు శిక్ష Tue, Jan 18, 2022, 11:39 AM
అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య Tue, Jan 18, 2022, 11:11 AM