ఎల్ఐసీ స్కీమ్.. రూ.40 లక్షలు పొందండిలా!

byసూర్య | Wed, Oct 27, 2021, 08:44 AM

ఎల్ఐసీ పలు రకాల పాలసీలు అందిస్తోంది. ఆ పాలసీల్లో "జీవన్ ఉమాంగ్" కూడా ఒకటి. 55 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది ఎండోమెంట్ ప్లాన్. లైఫ్ కవరేజ్‌ తో పాటు మెచ్యూరిటీ సమయంలో పాలసీ డబ్బులు కూడా పొందొచ్చు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీ డబ్బులు వస్తాయి. జీవన్ ఉమాంగ్ పాలసీలో 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ లభిస్తుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 లక్షలకు బీమా మొత్తానికి 30 ఏళ్ల ప్రీమియం టర్మ్‌ తో పాలసీ తీసుకుంటే నెలకు దాదాపు రూ.1280 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీరు 15, 20, 25 ఏళ్ల టర్మ్‌తో కూడా పాలసీ తీసుకోవచ్చు. మీరు 30 ఏళ్లు ప్రీమియం చెల్లించి తర్వాత అంటే.. మీకు 60 ఏళ్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీకు ప్రతి ఏడాది రూ.40 వేలు వస్తాయి. 99 ఏళ్ల వరకు మీకు ఇలానే ప్రతి ఏడాది డబ్బులు వస్తాయి. 100 ఏళ్ల తర్వాత బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం అన్నీ కలిపి మెచ్యూరిటీ కింద లభిస్తాయి. అంటే బోనస్ రూ.17.6 లక్షలు, ఎఫ్ఏబీ రూ.17.7 లక్షలు, బీమా మొత్తం రూ.5 లక్షలు మొత్తంగా రూ.40 లక్షల వరకు వస్తాయి. పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM