నవంబరు 14న తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు

byసూర్య | Sun, Oct 24, 2021, 12:15 PM

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 'టీఎఫ్‌సీసీ' ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. నవంబరు 14న ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీ ఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ- ''టీఎఫ్‌సీసీ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా చాంబర్‌లో 8000 మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది తెలంగాణ మూవీ ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం.


నవంబరు 14నే 'తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆసక్తిగలవారు పోటీ చేయవచ్చు'' అన్నారు. ''టీఎఫ్‌సీసీ' ప్రారంభమై ఏడేళ్లలో 8000 మంది సభ్యులుగా చేరడం సాధారణమైన విషయం కాదు. 'టీఎఫ్‌సీసీ' తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం'' అన్నారు టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్‌.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM