అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం
 

by Suryaa Desk |

 నగరంలోని అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టైర్ల గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో చాదర్ ఘాట్ - అఫ్జల్‌గంజ్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దట్టమైన పొగ అలుముకుంది. పక్కనే గుడిసెలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మూసీకి పక్కనే ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఫైర్ ఇంజిన్లకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 15 ఫైర్ ఇంజిన్లు రాగా.. అతికష్టం మీద 8 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి.


Latest News
హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్థంభాలు Sun, May 16, 2021, 05:39 PM
ఈటల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి.! Sun, May 16, 2021, 04:52 PM
లాక్‌డౌన్ నిబంధనలతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత Sun, May 16, 2021, 04:02 PM
వీణవంకలో ఈటల, టీఆర్‌ఎస్ వర్గీయులకు మధ్య ఘర్షణ Sun, May 16, 2021, 03:42 PM
వరుసగా ఆరు చైన్ స్నాచింగ్‎లు..బయాందోళనలో స్త్రీలు Sun, May 16, 2021, 03:28 PM