యాదాద్రిలో రేపటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
 

by Suryaa Desk |

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మార్చి 28న ఆర్జిత సేవలు నిలిపివేశారు. కాగా, ఆలయంలో కరోనా ప్రభావం తగ్గడంతో వారం రోజుల అనంతరం సేవలను మళ్లీ ప్రారంభించనున్నారు. ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణను రేపటి నుంచి పునరుద్ధరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆలయంలో సుమారు 78 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM