మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk |

మేడ్చల్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో అతివేగంగా తూప్రాన్ నుండి నగరానికి వస్తున్న టిప్పర్ రాంగ్ రూటులో వచ్చి ఢివైడర్ ఎక్కి కార్మికులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పుడూర్ గ్రామానికి చెందిన దశరథ (48) అనే అక్కడికక్కడే మృతి చెందాడు. కిష్టపూర్ గ్రామానికి చెందిన డబిల్ పూర్ లక్ష్మి(50)కి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిజేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM