మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు
 

by Suryaa Desk |

తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామం, హాలియా పట్టణాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని పట్టించు కోలేదని, అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని, వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్ కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన చరిత్ర దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఉందన్నారు. ఈ ప్రచారంలో మహమూద్ అలీ, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భగత్ తల్లి నోముల లక్ష్మి పాల్గొన్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM