అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
 

by Suryaa Desk |

ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలోని పాండవ బస్తీకి చెందిన బర్ల సత్యనారాయణ(40) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాగు చేసిన పంట మూడుసార్లు గోదావరి వరదకు గురై.. పంట నష్టపోవడంతో అప్పులు చేసి మరీ పంట వేశారు. అయితే, లాభం లేక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పురుగుమందు త్రాగటంతో అత్యవసర చికిత్స కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మృతిని భార్య కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM