నిజామాబాద్ జిల్లాలో 2 వేల కోళ్లు మృత్యువాత

byసూర్య | Wed, Jan 13, 2021, 01:37 PM

 జిల్లాలోని డిచ్‌ప‌ల్లి మండ‌లం యానంప‌ల్లి తండా శివారులోని ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 వేల‌కు పైగా కోళ్లు మృత్యువాత ప‌డ్డాయి. గ‌త నాలుగైదు రోజుల నుంచి వ‌రుస‌గా ఒక‌ట్రెండు కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో కోళ్ల ఫారం య‌జ‌మాని రామ‌చంద్ర‌గౌడ్ అప్ర‌మ‌త్త‌మై ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగైదు రోజుల క్రితం చ‌నిపోయిన కోళ్ల క‌ళేబ‌రాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపారు. ఆ రిజ‌ల్ట్ ఇంకా రాలేదు. అంత‌లోపే బుధ‌వారం ఉద‌యం 2 వేల కోళ్ల‌కు పైగా మృతి చెంద‌డంతో.. స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మృతి చెందిన కోళ్ల‌ను స‌మీప అట‌వీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చిపెట్టారు. 


Latest News
 

ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM
మెదక్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం Fri, May 03, 2024, 02:50 PM
ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత: సీపీ Fri, May 03, 2024, 02:48 PM
ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఘనతే Fri, May 03, 2024, 02:47 PM