లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

byసూర్య | Thu, Oct 08, 2020, 04:16 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఆగస్ట్ 31 తర్వాత సెన్సెక్స్ మరోసారి 40 వేల మార్కును అధిగమించింది. రూ. 16 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ను టీసీఎస్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 40,469కి ఎగబాకింది. అయితే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో లాభాలు పడిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్ల లాభంతో 40,183కి చేరుకుంది. నిఫ్టీ 96 పాయింట్లు పుంజుకుని 11,835 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


అల్ట్రాటెక్ సిమెంట్ (3.24%), టీసీఎస్ (3.19%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.63%), ఇన్ఫోసిస్ (2.57%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.56%).


 


టాప్ లూజర్స్:


ఓఎన్జీసీ (-2.84%), ఐటీసీ (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.81%), ఎల్ అండ్ టీ (-0.75%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.69%).


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM