పోలీస్ అంటే ఉద్యోగం కాదు అత్యుత్తమ సేవ: డిఐజి రంగనాధ్

byసూర్య | Thu, Oct 08, 2020, 04:33 PM

పోలీస్ అంటే ఒక ఉద్యోగంగా భావించవద్దని అది ఒక అత్యుత్తమ సేవగా భావించాలని అప్పుడే పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత గౌరవం పెంచేలా పని చేయవచ్చని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు.గురువారం నల్గొండ జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. 173 మంది అభ్యర్థులు అత్యంత క్రమశిక్షణాయుతంగా జాతీయ జెండా సాక్షిగా తీసుకున్న ప్రమాణానికి అనుగుణంగా నిస్పక్షపాతంగా, రాజ్యాంగబద్దంగా విధి నిర్వహణ చేస్తూ.. పాసింగ్ అవుట్ పరేడ్ రోజున చేసిన ప్రతిఙ్ఞ విధి నిర్వహణలో అన్ని సందర్భాలలో గుర్తుకు చేసుకోవాలని సూచించారు. పోలీస్ ఉద్యోగాన్ని ఒక అవకాశంగా తీసుకొని తపనతో ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పారు. పోలీస్ ఉద్యోగం పొందిన వారు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మాభిమానం కోల్పోవద్దని అప్పుడే మరింత సమర్ధవంతంగా విధి నిర్వహణలో ముందుకు సాగవచ్చన్నారు. అదే సమయంలో బలవంతుడి నుండి బలహీనులకు రక్షణ కల్పిస్తూ న్యాయం పక్షాన నిలిచి సేవలందిస్తూ పోలీస్ శాఖ పట్ల ప్రజలలో నమ్మకాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని సూచించారు. ఉద్యోగ నిర్వహణలో శిక్షణా సమయంలో నేర్చుకున్న ప్రతి అంశం ఎంతో ఉపయోగపడుతుందని, అదే S సమయంలో చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత కానిస్టేబుల్స్ పైనే ఉంటుందన్నారు. అదే సమయంలో నిబద్ధతతో పని చేస్తూ ప్రజలతో అన్ని స్థాయిలలో సత్సంబంధాలు నిర్వహించడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెంపొందించే విదంగా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయిలో కానిస్టేబుల్స్ పైనే ఉంటుందని, పేదలు, సామాన్యులు, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం చాలా గొప్పదని, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం ఈ ఉద్యోగం ద్వారా లభిస్తుందని ఆయన చెప్పారు.
అనంతరం డిటిసి ప్రిన్సిపాల్, అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి మాట్లాడుతూ.. 173 మంది సివిల్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు తొమ్మిది నెలల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని, శిక్షణా కాలంలో సైబర్ క్రైమ్, నాణ్యతతో కూడిన శిక్షణతో పాటు కంప్యూటర్, స్టేషన్ రైటర్స్, పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించాల్సిన విధులతో పాటు వివిధ అంశాలపై క్లాసులు నిర్వహించడం జరిగిందని వివరించారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు. 2013 సంవత్సరంలో 15 ఎకరాల స్థలంలో జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం ప్రారంభించి ఇప్పటివరకు అయిదు బ్యాచులలో పలువురు ఏ.ఆర్., సివిల్ కానిస్టేబుల్స్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ అభ్యర్థులు ప్రతిజ్ఞ కార్యక్రమం, నిషాన్ తోలి, మార్చ్ ఫాస్ట్ లను క్రమశిక్షణాయుతంగా, కన్నుల పండుగగా నిర్వహించారు.
అనంతరం శిక్షణ పొందిన కానిస్టేబుల్స్ కు తొమ్మిది నెలల శిక్షణలో భాగంగా వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన నాగరాజు, దుర్గా ప్రసాద్, శశికాంత్, సురేష్ లకు ట్రోఫీలు, షీల్డ్స్ అందించి డిఐజి రంగనాధ్ అభినందించారు.
పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో డిఐజి సతీమణి లావణ్య రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు సురేష్ కుమార్, రమణారెడ్డి, వెంకటేశ్వర్ రావు, ఆనంద్ రెడ్డి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రామచందర్ గౌడ్, ఆర్.ఐ.లు శ్రీనివాస్, వై.వి. ప్రతాప్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, సిఐలు నిగిడాల సురేష్, బాలగోపాల్, పి.ఎన్.డి. ప్రసాద్, అనిల్ కుమార్, నాగేశ్వర్ రావు, సురేష్ బాబు, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్ రావు, సబితా రాణి, ఎస్.ఐ.లు అంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM