వైద్యుల రక్షణకు గాంధీలో పోలీసుల మోహరింపు

byసూర్య | Fri, Apr 03, 2020, 10:20 AM

 గాంధీ ఆస్పత్రిలో ఇటీవల వైద్యులపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్‌ సహా పలు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు దాడిని తీవ్రంగా ఖండించారు. మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ నిన్న ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు పోలీస్‌ సిబ్బందిని ఆస్పత్రిలో వైద్యుల రక్షణకు నియమించారు. వీరంతా గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసుల ఫోటోను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM