వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు : మంత్రి తలసాని

byసూర్య | Thu, Apr 02, 2020, 02:58 PM

 వైద్యులపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంత్రి నేడు నగరంలోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. దాడి ఘటనపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... వైద్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులకు భరోసా కల్పించినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా పికెట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దన్నారు. 


గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల యాచకులను తరలించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారందరిని దాదాపు గుర్తించినట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అంతకుక్రితం ఆదర్శనగర్‌లో పేదలకు మంత్రి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రేషన్‌ కార్డులు లేని పేదలకు సరుకులను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో చాలామంది దాతలు ముందుకొస్తున్నారన్నారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM