తెలంగాణలో బియ్యం పంపిణీ

byసూర్య | Wed, Apr 01, 2020, 10:40 AM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే ప్రతి ఒక్కరికి ఉచితంగా 12 కేజీల బియ్యం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో నేటి నుంచి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు. మంగళవారం రోజు బియ్యం పంపిణీపై పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం నుంచి రేషన్ పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కోటి 9 లక్షల కుటుంబాలున్నాయి. వీరిలో 87 లక్షల 59 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ కార్డుల ద్వారా 2 కోట్ల 81 లక్షల మంది లబ్దిదారులకు 12 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేయనున్నాయి. లబ్దిదారులు కూపన్లు తీసుకుని తమకు కేటాయించిన సమయంలో రేషన్ షాపుకు వెళ్తే బియ్యాన్ని పంపిణీ చేస్తారు. గుంపులు గుంపులుగా వెళ్లకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వెళ్లాలని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే నిత్యావసర సరుకుల కోసం ప్రతి రేషన్ కార్డుకు 1500 రూపాయాలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డబ్బులు ఎప్పడు వేస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నిధుల పంపిణీకి ఈ-కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడతున్నామని అధికారులు చెబుతున్నారు. ఆహారభద్రత కార్డుల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఆధార్‌కార్డు ఆధారంగా సమకూర్చి.. ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM